Thursday, December 19, 2024

మేడారం హుండీలో నకిలీ నోట్లు

- Advertisement -
- Advertisement -

మేడారం జాతర హుండీల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో ప్రారంభమైంది. జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీలను హనుమకొండకు చేర్చి, గురువారంనుంచీ లెక్కింపు ప్రారంభించారు. మొదటిరోజున లెక్కించిన 134 హుండీలలో 3,15,40,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తేలింది. ఇందులో కొన్ని నకిలీ నోట్లు కూడా  బయటపడ్డాయి. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలంటూ కొందరు నోట్లపై రాసి హుండీలో వేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, పోలీసు బందోబస్తుతో లెక్కింపు పకడ్బందీగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News