Saturday, November 23, 2024

రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం..46 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్ర ఒక ఏడంతస్తుల షాపింగ్ మాల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్డులోని గ్రీన్ కోజీ కాటేజ్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మాల్‌లో అనేక రెస్టారెంట్లు, దుకాణాలు ఉన్నాయి. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కచ్ఛి భాయ్ అనే ప్రముఖ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి 9.50 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు మరిన్ని రెస్టారెంట్లు, బట్టల సాపులు ఉన్న పై అంతస్తులకు వ్యాపించాయి. తెల్లవారుజామున 2 గంటలకు ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి 33 మృతదేహాలు, షేక్ హసీనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి 10 మృతదేహాలను, పోలీసు ఆసుపత్రికి ఒకరి మృతదేహాన్ని తరలించినట్లు బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంతా లాల్ సేన్ తెలిపారు.

గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ డాక్టా మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఐసియులో ఉదయం మరణించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 46 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 10 మంది షేక్ హసీనా బర్న్ యూనిట్‌లో, ఇద్దరు ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఢాకాలో ఇంత భారీ స్థాయిలో అగ్నిప్రమాదం జరగడం ఇటీవలి సంవత్సరాలలో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. కాగా..రెస్టారెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది మరణించడం పట్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిన బహుళ అంతస్తుల భవనంలో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News