Sunday, November 24, 2024

మానవత్వం చాటుకున్న ఇన్స్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థినికి సాయం చేసి మానవత్వాతన్ని చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్. నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి శుక్రవారం ఉదయం బైక్ ఇంటి నుంచి బయలుదేరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఉండడంతో బైక్‌పై హడావిడిగా వెళ్తుండగా సికింద్రాబాద్‌లోని ఎంజి రోడ్డు మార్గంలో బైక్ అదుపు తప్పి తండ్రి, కుమార్తె కిందపడిపోయారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తలకు తీవ్ర గాయాలవగా అక్కడే ఉన్న మహంకాళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ ఉపాశంకర్ వెంటనే స్పందించారు.

విద్యార్థినిని తన వాహనంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స చేయించారు, అనంతరం తన వాహనంలోనే పరీక్ష కేంద్రానికి చేర్చారు. దీంతో గాయాలతో విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందే ఆ విద్యార్థిని వెళ్లాల్సిన పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్‌కు ఇన్స్‌స్పెక్టర్ రోడ్డు ప్రమాదం సమాచారం అందించి, అతడి అనుమతి తీసుకున్నారు. కాగా, విద్యార్థిని తలకు బలమైన గాయం కావటంతో ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపా శంకర్ చేసిన సాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News