Saturday, December 21, 2024

యాదాద్రిని మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తాం…

- Advertisement -
- Advertisement -

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం  పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తాజాగా స్పష్టం చేశారు. ఆలయాన్ని దర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. కొండపై డార్మిటీ హాల్ నిర్మించి భక్తులకు నిద్ర చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఆలయ పూజారుల కోసం మరుగుదోడ్లు, విశ్రాంతి గదుల్ని ఏర్పాటు చేయనున్నామని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News