- Advertisement -
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ టోల్ గేట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఇంచెర్ల గ్రామానికి చెందిన కళ్యాణ్ కుమార్ టోల్ గేట్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన కళ్యాణ్ ను స్థానికులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడనుంచి హన్మకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -