Monday, November 25, 2024

బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షకుడు బండి సంజయ్ అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 350కి పైగా సీట్లు వస్తాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ బిజెపి గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9న శివరాత్రి సందర్భంగాయాత్రకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు బండి. వంద రోజుల్లోపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెల్లరేషన్ కార్డు ఉన్నా పథకాల్లో కోత పెడుతున్నారని మండిపడిన ఆయన 50 లక్షల కుటుంబాలకు పథకాల్లో కోత పెట్టడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాగ్ చెప్పినా చర్యల్లేవు ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయాలు పక్కనపెట్టి.. అభివృద్ధి చేస్తే కేంద్రం సహకరిస్తోందని సూచించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని తిట్టడానికి పరిమితమైందన్న బండి సంజయ్ మండిడ్డారు. భూదాన్ భూముల పేరుతో వినోద్ కుటుంబ అక్కమాలు నిజం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News