Friday, November 22, 2024

ఆర్‌ఎస్‌ఎస్ నేత హత్యకేసు: దక్షిణాఫ్రికాలో నిందితుడు నియాజీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది. నియాజీ తలపై రూ.5 లక్షల రివార్డును ఎన్‌ఐఎ గతంలో ప్రకటించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)లో కీలక నాయకుడైన నియాజీ 2016లో బెంగళూరులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రుద్రేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రుద్రేష్ హత్య అనంతరం తప్పించుకు పారిపోయిన నియాజీ వివిధ దేశాలలో నివసిస్తున్నాడు.

నియాజీ కదలికలపై నిఘా పెట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిజస్వాడ్(ఎటిఎస్) తనకు లభించిన కీలక సమాచారాన్ని ఎన్‌ఐఎకు అందచేసింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న నియాజీని ఎన్‌ఐఎ అక్కడే అదుపులోకి తీసుకుంది. రుద్రేష్ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అతని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు అవిశ్రాంతంగా వేటాడాయి. నియాజీని దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకు నిజాయీని తరలిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి హత్య కేసు విచారణను నియాజీ ముంబైలో ఎదుర్కొంటాడని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News