Monday, December 23, 2024

బిజెపికి మరో ఎంపి గుడ్ బై..!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపికి మరో ఎంపి గుడ్ బై చెప్పారు.  రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించవద్దని బిజెపికి చెందిన మరో ఎంపి జయంత్ సిన్హా పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశానని జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపి జయంత్ సిన్హా ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాను కృషి చేయవలసి ఉందని ఆయన తెలిపారు.

అయితే ఆర్థిక, పాలనాపరమైన అంశాలకు సంబంధించి పార్టీ కోసం తన సేవలను కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ ఇద్దరు ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని, అందుకే వీరు ముందుగానే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని ఊహాగానాలు సాగుతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన పలువురు సిట్టింగ్ ఎంపీలు తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని, తాము పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెడతామని చెబుతున్నట్లు తెలుస్తోంది.

కాగా..తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా శుక్రవారం తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై తాను దృష్టిని పెట్టాల్సి ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News