న్యూఢిల్లీ : పౌరుల స్వేచ్ఛ అత్యంత కీలకం, శిరోధార్యం. 21వ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ. అత్యంత ప్రాధాన్యం. దీనిని ఎవరూ కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత అంశాల వ్యాజ్యాలను హైకోర్టు త్వరితగతిన విచారణకు తీసుకోకపోవడం తప్పని పేర్కొంది. ఇది వ్యక్తులను వారికుండే ఈ అత్యంత విలువైన హక్కుకు దూరం చేయడం అవుతుందని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇటీవల తమ తీర్పులో స్పందించింది. మహారాష్ట్రలో కార్పొరేటర్ హత్యోందంతంలో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరీ విషయంలో బొంబాయి హైకోర్టు కేసులోని ఉచితానుచితాలను పక్కకుపెట్టి, బెయిల్‌పై తాత్సారం చేసిందని , ఇందుకు పలు సాకులు తెలిపిందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 21 మేరకు వ్యక్తుల స్వేచ్ఛ సంబంధిత బెయిల్ వ్యవహారాలపై త్వరితగతి నిర్ణయాలను బొంబాయి హైకోర్టు తీసుకోలేకపోతోందని ధర్మాసనం తప్పుపట్టింది. పౌరులకు ఉండే హక్కును ఏ విధంగా కాదంటారని నిలదీశారు.
ఆర్టికల్ 21తో ఆషామాషీలు వద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -