Sunday, December 22, 2024

ముదిరిన ఎండలు !

- Advertisement -
- Advertisement -

నిప్పుల్లో నిర్మల్.. 39 డిగ్రీలు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎండలు ముదురుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిండు వేసవిని తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిలా సెగలు చిమ్మాయి. శనివారం రాష్ట్రంలో గరిష్టంగా 39డిగ్రీలు నమోదయ్యాయి. కనిష్టంగా 36.5డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నిర్మల్‌లో 39 డిగ్రీలు నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో కూడా 39 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 36.5 డిగ్రీలు నమోదయ్యాయి. జనగాం, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 31 జిల్లాలకు వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాల్లో ఉష్ణోగల తీవ్రత సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా ఉంటాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో 38. 6డిగ్రీలు నమోదయ్యాయి.

రాగల రెండు రోజుల్లో నగరం పరిధిలో ఉష్నోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం సూచించింది. ఉష్ణోగ్రతలు సాధారణంగా 35డిగ్రీలకు లకు లోపుగా ఉంటే గ్రీన్‌మార్క్‌లో ఉంచి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు చేయదు. ఉష్ణోగ్రతలు 35నుంచి 40డిగ్రీల మధ్యన ఉంటే ఎల్లో మార్కులో ఉంచి ఈ జిల్లాలకు జాగ్రత్తగా ఉండాలసి హెచ్చరిక జారీ చేస్తుంది. అదే 40నుంచి 45డిగ్రీల మధ్యన నమోదైతే ఆరెంజ్ మార్కులో ఉంచి ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తుంది. 45డిగ్రీలు దాటితే ఈ జిల్లాలను రెడ్‌మార్కు జోన్‌లోకి చేర్చి ప్రమాదంలో ఉన్నట్టు ప్రకటిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News