Saturday, November 23, 2024

రిజర్వాయర్లలో త్రాగునీటి నిల్వలు నిరంతరం పర్యవేక్షించాలి

- Advertisement -
- Advertisement -

వేసవిలో గ్రామాల ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడాలి
మిషన్ భగీరథ పైపులైన్లు దెబ్బతింటే వెంటనే పనులు చేపట్టి నీటి సరఫరా జరగాలి: మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైన రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటి నిలువలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. శనివారం మిషన్ భగరథ ఇంజనీర్ ఇన్ చీప్ ఎర్రమంజిల్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్లు నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గూడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పైపులైన్లు పగిలిపోయిన లీకైన వెంటనే వాటిని సరిదిద్ది నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలి, ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని హెచ్చరించారు.

ప్రత్యేక అభివృద్ది నిధులలో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి సిఎం రేవంత్‌రెడ్డి ఒక కోటి రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయి అవసరాలను గమనించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ వేసవిలో తరచూ సమీక్షలు నిర్వహించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. చీఫ్ ఇంజనీరింగ్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. మండల స్థాయి మిషన్ భగీరథ ఇంజనీర్లు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలి. ఈ సమావేశంలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంజనీరింగ్ చీప్ కృపాకర్ రెడ్డి తో పాటు ఇతర మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News