Monday, December 23, 2024

పాక్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ ?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పిఎంఎల్‌ఎన్ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ మళ్లీ రెండోసారి పాక్ 33 వ ప్రధానిగా ఆదివారం ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందని, ఆర్థిక అస్థిరత, భద్రత సవాళ్ల మధ్య సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన సిద్ధమౌతున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఉమ్మడి అభ్యర్థి అయిన షెహబాజ్ తన నామినేషన్‌ను ఇప్పటికే దాఖలు చేశారు. ఆయనకు పోటీగా పాకిస్థాన్ తెహ్రీక్ ఆ ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థిగా ఒమర్ ఆయూబ్ ఖాన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు.

కొత్త ప్రధానిని ఎన్నుకోడానికి నేషనల్ అసెంబీ సెక్రటేరియట్‌లోఆదివారం ఓటింగ్ జరుగుతుంది. ఎవరు విజేత అయితే వారు సోమవారం అధ్యక్షభవనం అయివాన్ ఇ సదర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. పిఎంఎల్ ఎన్ అధ్యక్షుడైన షెహబాజ్ షరీఫ్ (72) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (74) సోదరుడు. షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా భారీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేశారన్న మంచి సమర్ధుడిగా గుర్తింపు పొందారు. అయితే 2022లో ప్రధానిగా 16 నెలలు బాధ్యతలు నెరవేర్చినప్పుడు తన సమర్థతను అంతగా చూపించలేకపోయారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News