- Advertisement -
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సీసీ కార్నర్ రాజా ఎలక్ట్రికల్స్ పక్కన గల ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న రెండు షాపులు పూర్తిగా దగ్ధం అయినవి. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షల కు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. కాలిపోయిన రెండు షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడడంతో చుట్టు పక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -