Monday, December 23, 2024

ఫొటోషూట్‌కు పిలిచి చంపేశారు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఫొటోషూట్‌కు పిలిచి ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోన మధురవాడ ప్రాంతం బక్కన్నపాలెంలో సాయికుమార్(23) అనే యువ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు చేసుకొని దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫొటోషూట్ రావాలని ఫోన్ చేశారు. పది రోజుల ఫొటోషూట్ ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్ రావులపాలెం వెళ్లాడు.

రూ.15 లక్షల విలువైన కెమెరాలు సామాగ్రితో అతడు అక్కడికి వెళ్లాడు. సాయి విశాఖలో రైలు ఎక్కి రాజమహేంద్రవరంలో దిగాడు. ఇద్దరు యువకులు అతడిని కారులో పికప్ చేసుకొని వెళ్లిపోయారు. మూడు రోజుల నుంచి కుమారుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు విశాఖపట్నంలోని పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరు యువకులు సాయిని చంపి పూడ్చిపెట్టారు. కెమెరా, సామాగ్రి కోసమే హత్య చేసినట్టు తేలడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News