- Advertisement -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పిస్తా హౌజ్ హోటల్లో రౌడీ షీటర్లు ఆదివారం వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించిన 17 మంది గ్యాంగ్ సభ్యులు భోజనం చేస్తున్న వారి పై దాడికి పాల్పడ్డారు. అకారణంగా హోటల్లో ఉన్న సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడు గుద్దుల వర్షం కురిపించారు. దీంతో హోటల్ ఉన్న జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడి చేశారు. రెచ్చిపోయిన రౌడీ షీటర్స్ మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశారు. దీంతో కస్టమర్స్, యాజమాన్యం ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పిస్తాహౌజ్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -