- Advertisement -
టికెట్ రాని మాజీ మంత్రి హర్ష్‌వర్థన్
న్యూఢిల్లీ : బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ రాజకీయాలు వీడారు. తాను రాజకీయ రంగ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న దశలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితా క్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. బిజెపి తొలి జాబితాలో ఈ నేత పేరు లేదు. తాను రాజకీయాలకు పనికిరానేమో అన్పిస్తోంది.
ఇక తిరిగి తన పూర్వపు వైద్యవృత్తిలోకి వెళ్లుతా అని వర్థన్ ప్రకటించారు. తనకు ఇంతకాలం పలు స్థాయిల్లో పనిచేసేందుకు, ప్రజలకు సేవలనందించేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, ఇతర నేతలకు, పారీ కార్యకర్తలకు ధన్యవాదాలు అని తెలిపారు. గడిచిన 30 ఏండ్ల ఎన్నికల రాజకీయ ప్రక్రియ దశలో పలు ఘనవిజయాలను సాధించానని ఈ నేపథ్యంలో పేర్కొన్నారు.
- Advertisement -