Sunday, December 22, 2024

ఇందిరమ్మ ఇళ్లు ఏవిధంగా పంపిణీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పతనం: ఎంపి బండి సంజయ్ 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారో ప్రజలకు చెప్పాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్‌ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రజాహిత యాత్ర నిర్వహించి పట్టణంలోని పలు వీధులలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టిస్తారా? గత ప్రభుత్వం సాదాసీదాగా కట్టిన రెండు పడకల గదులను కేటాయిస్తారా?  అని నిలదీశారు.

గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇళ్లను నిర్మించి ఇస్తారని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను చూసి మోసపోయి ఓటేశామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క మహాలక్ష్మి పథకం అమలుకే రూ.50 వేల కోట్లు అవసరమని, మిగతా ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలన్నారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించిందని, మరి ఆరు గ్యారంటీల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డులకు లింక్ పెట్టడంపై మండిపడ్డారు. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News