విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం… ఉ త్తర్‌ప్రదేశ్ ఖాన్‌పూర్‌కు చెందిన మీనాక్షిదేవీ, జయరామ్‌లు దంపతులు కా గా జయరామ్ మోచీ పనిచేస్తుంటాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చి భయ్యాలాల్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు నక్స్ కుమార్ ఈదిబజార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంచినీరు (నల్లా) పట్టడానికి చిన్న కుమారుడు నక్స్ కుమార్ (10)ని తల్లి మోటర్ స్విచ్ వేయమని చెప్పింది.
అయితే మోటారుకు గల తీగ పాతబడి అందులోని లో హపు తీగపైకి తేలి ఉన్న విషయాన్ని గమనించక బాలుడు ప్రమాదవశాత్తు దానికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో బాలుడిని గమనించిన తల్లి స్థానికుల సహాయంతో హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ స భ్యులకు అప్పగించారు. ఎఎస్‌ఐ మధుసూదన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.