Friday, December 20, 2024

ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం

- Advertisement -
- Advertisement -

పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం బీహార్ రాజధాని పాట్నాలో సమీకృతం అయ్యారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు విరామం ఇచ్చి మధ్య ప్రదేశ్ నుంచి ప్రత్యేకం గా వచ్చిన రాహుల్ గాంధీ పావు గంట సేపు మాట్లాడి, మైకును ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందజేసి, తన యాత్ర కొనసాగింపునకు తిరిగి వెళ్లారు. కాంగ్రె స్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సంక్షిప్త ప్రసంగంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మోడీ ప్రభుత్వం‘కేవ లం ఇద్దరు ముగ్గురు సూపర్ ధనికుల కోసం పని చేస్తూ, జనాభాలో 73 శాతం ఉన్న దళితులు, వెనుకబడిన తరగతులను నిర్లక్షం చేస్తున్నది’ అని రాహుల్ విమర్శించా రు. ఇటీవల ఒక కూటమి నుంచి మరొక కూటమికి ఫిరాయించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఖర్గే తన ప్రసంగంలో దుయ్యబట్టారు. ఖర్గే ప్రసంగం అనంతరం ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ‘జన్‌విశ్వాస్ మహా ర్యాలీ’కి ముగింపు పలికారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న 17 నెలల కాలంలో భారీ ఎత్తున ఉద్యోగాలు సృష్టించినందుకు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఖర్గే ప్రశంసిస్తూ, ‘మీ చాచా (నితీశ్‌ను ఉద్దేశించి) ఫిరాయించారు. ఆయన మళ్లీ అలా చేయవచ్చు. కానీ ఆయనను ఇక మీదట ఆమోదించవద్దు’ అని అన్నారు.

జెడి (యు) సారథిగా ఉన్న నితీశ్ కుమార్ 2022లో బిజెపితో తెగతెంపులు చేసుకుని ఆర్‌జెడి, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. ఇండి యా కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించా రు కూడా. అయితే, ఎన్‌డిఎలో తిరిగి చేరిన తరువాత ఆయన ప్రతిపక్ష కూటమిలో వ్యవహారాల పట్ల తాను ఆనందంగా లేనని, ఆ కూటమి పేరు కూడా తనకు అంగీకార యోగ్యం కాదని నితీశ్ చెప్పారు. కాగా, బీహార్ సిఎం నితీశ్‌పై మరింత పరుష విమర్శలు ఆయన బద్ధ శత్రువు లాలూ నోటి నుంచి వచ్చాయి. ‘రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కేంద్రంలో అధికారంలో నుంచి ప్రధాని నరేంద్ర మోడీని దించేందుకు మీరు వోటు వేస్తున్నప్పుదు మీకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకు నేను అక్కడే ఉంటా’ అని లాలూ జనసమూహాన్ని ఉద్దేశించి అన్నారు. 2017లో నితీశ్ ఫిరాయింపును లాలూ గుర్తు చేస్తూ, ‘అప్పట్లో నేను నితీశ్‌ను ఏమాత్రం నిందించలేదు. ఆయనను ‘పల్టూరామ్’ (ఫిరాయింపుదారు) అని మాత్రమే అన్నారు. ఆయన సొంత చర్యల కారణంగా ఆ పేరు ఆయన వ్యక్తిత్వానికి సరిపోతుంది. సోషల్ మీడియాలో ఆయనపై హాస్య వీడియోలను చూడగలను. అవి ఆయనను సిగ్గు పడేలా ఎందుకు చేయడం లేదని ఆశ్చర్యపోతుం టా’ అని చెప్పారు. లాలూ తన సంతానంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, రాజకీయాలలో ‘పరివార్‌వాద్ (ఆనువంశిక పాలన)’ను విమర్శించినందుకు ప్రధానిని దుయ్యబట్టారు. ‘నరేంద్ర మోడీకి సొంతంగా ఒక కుటుం బం లేకపోతే ఏమి చేయగలం? ఆయన రామ్ మందిరం గురించి అదే పనిగా మాట్లాడుతుంటారు. ఆయన కనీ సం అసలైన హిందువు కాదు. హిందు సంప్రదాయంలో తన తల్లిదండ్రుల మరణం సమయంలో కొడుకు పూర్తిగా క్షవరం చేయించుకోవాలి. మోడీ తన తల్లి మరణించినప్పుడు అలా చేయలేదు’ అని లాలూ విమర్శించారు. ర్యాలీలో తేజస్వి యాదవ్, లెఫ్ట్ నేతలు సీతారామ్ ఏచూరి, డి రాజా, దీపంకర్ భట్టాచార్య కూడా మాట్లాడారు. ర్యాలీకి భారీ స్థాయిలో జనం హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News