Monday, November 25, 2024

ఎన్‌టిపిసి రెండో యూనిట్‌ను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయ్యిందని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 56వేల కోట్లు విలువైన రైల్వే, అంబారి-పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్- మౌలాలి మార్గానికి సంబంధించిన అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు. రామగుండం ఎన్‌టిపిసి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సందర్భంగా మోడీ ప్రసంగించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్‌టిపిసి రెండో యూనిట్‌ను ప్రారంభించామని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుందని కొనియాడారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రశంసించారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News