Monday, January 20, 2025

అయోధ్య రామ మందిరం పేరుతో రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

హిందూ మతానికి నష్టం చేసేది బిజెపియే : మల్లు రవి

మన తెలంగాణ / హైదరాబాద్ : సర్వే జన సుఖినో భవంతు..రాముడు అందరి వాడు ఏఒక్కరికి చెందినవాడు కాదు, బిజెపి పార్టీ అయోధ్య రామమందిరం పేరు చెప్పి రాజకీయాలు చేస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు డా. మల్లు రవి అన్నారు. ఎవరైనా హిందూ మతానికి నష్టం చేస్తున్నారంటే అది బిజెపి పార్టీయేనని ఆయన విమర్శించారు.

గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్, బిఎస్‌పి పార్టీలు కాంగ్రెస్ ని చూసి భయపడ్తున్నాయని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి మల్లు రవియే ఉంటారని, దీనిపై ముఖ్య మంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. తను నలభై సంవత్సరాల నుండి రాజకీయ జీవితంలో వున్నానని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నావంతు కృషి చేశానని, తను ఎవరికీ సన్నిహితున్ని కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదని మల్లు రవి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News