Thursday, December 19, 2024

మేడిగడ్డ బ్యారేజ్‌పై హైకోర్టులో విచారణ, ధర్మాసనం కీలక ఆదేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్ట్‌లో సోమవారం విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జుడిషియల్ విచారణ కోరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌జడ్జ్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ప్రభుత్వం తెలిపింది. విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఇంజనీర్లను విధుల నుండి తొలగించినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసు కుంటున్నామని వివరించింది.

ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. డ్యాం సేఫ్టీ అథారిటీ ఆరు గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఆదివారం (మార్చి 3) నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.

మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్‌ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి, కుంగు బాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News