Friday, January 3, 2025

నార్సింగిలో హిట్ అండ్ రన్.. మృతి చెందిన ఆర్మీ జవాన్

- Advertisement -
- Advertisement -

ఔటర్ రింగ్ రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం…గోల్కొండ ఆర్టలరీ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ కులాన్ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్‌ను ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్‌లో ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. జవాన్‌ను ఢీకొట్టిన వాహనం రెడీమీక్స్‌గా గుర్తించారు. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఎందుకు వచ్చాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News