Wednesday, January 1, 2025

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య మధుమితపై సాహు అనుమానం పెంచుకున్నాడు. వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. దీనిపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మధుమిత తలపై సాహు బండరాయితో కొట్టి చంపివేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News