Saturday, November 23, 2024

తెలుగు మీడియంతోనే ఈ స్థాయికి వచ్చా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నాకు ఇంగ్లీషు రాదని కొందరు అవహేళన చేస్తున్నారని, నేను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియాలో చదివానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేలాది గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెబుతున్నారని, ఎక్కడ వాటికి శాశ్వత భ వనాలు నిర్మించలేదని మండిపడ్డారు. సోమవారం ఎల్‌బిస్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మంది నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతులు లేని అద్దె భవనాల్లో పేద విద్యార్ధులు అవస్దలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేషనైలేజేషన్ పేరుతో మాజీ సిఎం కెసిఆర్ 6 వేల స్కూళ్లకు తాళాలు వేశారని, కులవృత్తుల వారి పిల్లలు ఆ పనులు చేసుకోవాలని కుట్ర పన్ని ఉన్నత చదువుల వైపు రాకుండా చేశారని ఆరోపించారు. విద్యపై పెట్టే ఖర్చు ఖర్చు కాదని, భవిష్యత్ తరాల నిర్మాణానికి ఉపయోగపడే ఇంధనమన్నారు. ప్రస్తుత నియమితులైన ఉపాధ్యాయులు తెలంగాణకు అఖిల భారత స్థాయి అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ను, డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేసే బాధ్యతను చేపట్టబోతున్నారని, సర్పంచులు మొదలు ప్రధానమంత్రి వరకు తయారు చేసే బాధ్యత వారిపైనే ఉందన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానంటే ప్రభుత్వ పాఠశాలలో అందించిన విద్యనే కారణమన్నారు.

తాను గుంటూరు, గుడివాడలో చదువుకోలేదని, గుంటూరులోనే, గుంటూరు మరెక్కడో చదువుకున్న కొందరు తనకు అంగ్ల భాష అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా, జపాన్, జర్మనీలో వారికి ఇంగ్ల్లీష్ రాదని, కానీ ప్రపంచంలోనే పోటీపడే అభివృద్ధి, ఉత్పత్తులను ఆయా దేశాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇంగ్లిష్ అనేది ఓ భాష, ప్రపంచంలో ఉద్యోగం, ఉపాది కల్పనకు ఉపయోగపడుతుందని, తమ రోజుల్లో నాడు ఉన్న అవకాశాలను పట్టి అక్కడ నేర్పిన చదువులు నేర్చుకున్నామన్నారు. నేడు ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే ఇంగ్లీషును ఉపాద్యాయులు నేర్పాలని, మీ దగ్గర చదువుకునే పిల్లలకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేసే పరిస్థితి రావద్దని సూచించారు. పిల్లలకు మంచి భాషను, దేశభక్తిని నేర్పాలని, వారే రేపటి పాలకులు అవుతారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News