Thursday, December 19, 2024

ఎల్‌బి నగర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం… వీడియోలతో వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని లొంగదీసుకొని తన స్నేహితుడి సహాయంతో కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం వీడియోలతో ఆమెను లైంగికంగా వేధించిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ పరిధిలోని నాగోల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్‌బి నగర్‌లోని నాగోల్‌లో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. యువతి డిగ్రీ చదివేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువకుడు పరిచయమయ్యాడు. యువకుడు అదే ప్రాంతానికి చెందిన వాడు కావడంతో యువతి కాలేజీ వద్దకు వెళ్లి కలిసేవాడు. గత సంవత్సరం ఏప్రిల్ 3న యువతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్ పై డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో ఎల్‌బి నగర్‌లోని కామినేని చౌరస్తాలో గల రెసిడెన్సీ లాడ్జ్ కు తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిసి యువతికి ఇవ్వడంతో స్పృహ తప్పిపడిపోయింది. తరువాత తన స్నేహితుడి సహాయంతో ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. యువతి భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. యువతి కుటుంబం నాగోల్ నుంచి బోరబండకు మకాం మార్చారు. ఆమె స్థానికంగా ఉంటూ ఓ మార్ట్‌లో క్యాషియర్‌గా పని చేస్తుంది. మార్ట్ వద్దకు యువకుడు వచ్చి తన దగ్గర వీడియోలు ఉన్నాయని, తాను చెప్పినట్టు వినాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో జరిగిన విషయం యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో బొరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీజులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఎల్‌బి నగర్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News