Monday, December 23, 2024

ఎస్‌బిఐ ద్వారా మోడీ సర్కార్ కొత్త నాటకం: ఖర్గే ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి మరి కొంత వ్యవధి కావాలంటూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. తన అక్రమ లావాదేవీలను కప్పిపుచ్చుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్‌బిఐని రక్షణ కవచంగా వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్న ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి తమకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని కోరుతూ ఎస్‌బిఐ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీలోగా ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని ఎస్‌బిఐని ఆదేశించింది.

ఎన్నికల బాండ్ల పథకం అక్రమం, అప్రజాస్వామికం, రాజకీయ పార్టీలకు సమన్యాయం లేకుండా చేయడంగా కాంగ్రెస్ మొదటి నుంచి భావిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా గాసింగిచన తన అక్రమ లావాదేవీలను కప్పిపుచ్చడానికి దేశంలోని అతి పెద్ద బ్యాంకును రక్షణ కవచంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని నల్ల ధనం మార్పిడి పథకంగా మోడీ ప్రభుత్వం మార్చుకుందని, ఈ ర్యాంగ వ్యతిరేక, ఆర్‌టిఐ వ్యతిరేక, చట్టవిర్ధు పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని ఆయన తెలిపారు. మార్చి 6వ తేదీ లోగా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని స్వయానా సుప్రీంకోర్టే ఎస్‌బిఐని ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీని సంగతి చూడాలని బిజెపి భావిస్తోందని ఆయన అన్నారు.

జూన్ 16న ప్రస్తుత లోక్‌సభ కాల పరిమితి ముగుస్తుందని, జూన్ 30న వివరాలు బహిర్గతం చేస్తామని ఎస్‌బిఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మోసపూరిత పథకాని ద్వారా అధికంగా ప్రయోజనం పొందింది బిజెపియోనని ఆయన అన్నారు. ఎన్నికల బాండ్లను ద్వారా లబ్ధి పొంది అందుకు ప్రతిఫలంగా హైవేలు, రేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు తదితర భారీ కాంట్రాక్టులను ప్రధాని మోడీ అనుయాయులకు కట్టబెట్టారని, బిజెపి సాగించిన ఈ అక్రమ లావాదేవీలను దాచిపెట్టేందుకు మోడీ ప్రభ్తువం ప్రయత్నిస్తున్నది నిజం కాదా అని ఖర్గే ప్రశ్నించారు. 44,434 టోమోటెడ్ డాటా ఎంట్రీలను 24 గంటల్లో వెలికితీసి సరిపోలవచ్చని నిపుణులు చెబుతున్నారని ఆయన తెలిపారు. మరి ఎస్‌బిఐకి మరో 4 నెలల సమయం ఎందుకు అవసరమని ఆయన ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం, పిఎంఓ దేశంలోని ఆర్‌బిఐ, ఎన్నికల కమిషన్, పార్లమెంట్, ప్రతిపక్షం వంటి అన్ని వ్యవస్థలను బిజెపి ఖజానా నింపేందుకు ధ్వంసం చేశాయని ఆయన ఆరోపించారు. కాగా..కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్‌బిఐఇ విజ్ఞప్తికి అనుమతించవద్దని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఎన్నికల బాండ్లపై తన యంత్రాంగంతో ఎస్‌బిఐ అధికారులు తప్పించుకుని వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల బాండ్ల దాతల పేర్లు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News