కొనసాగుతున్న విజయాల పరంపర
డెమోక్రాట్ రేసులో బైడెన్ ముందంజ
బిస్వార్క్ (యుఎస్) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉత్తర డకోటా రిపబ్లికన్ అధ్యక్ష కాకసస్‌లో నెగ్గారు. దీనితో ట్రంప్ విజయాల పరంపర కొనసాగుతోంది. 12 కాకస్ ప్రదేశాల్లో నిర్వహించిన వోటింగ్‌లో ట్రంప్ మొదటి స్థానం పొందారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఫలితంతో ట్రంప్ తిరిగి గెలుపు బాట పట్టినట్లు అయింది.
ఆయన విజయ పరంపరకు ఆదివారం అంతరాయం కలిగింది. కొలంబియా జిలా ప్రైమరీలో హేలీ తన ప్రచారంలో తొలి విజయం సాధించింది. శ్వేత సౌధంలో పగ్గాలను ఆశిస్తున్న అభ్యర్థులు 16 రాష్ట్రాల నుంచి ఫలితాలు రానున్న ‘సూపర్ ట్యూస్‌డే’పై తమ దృష్టి కేంద్రీకరిస్తార. అధ్యక్ష ప్రైమరీలో ఏ రోజునైనా ఏకైక అతిపెద్ద డెలిగేట్ ఫలితం తేల్చే ఫలితాలు అవి. ట్రంప్, అధ్యక్షుడు జో బైడెన్ (డెమోక్రాట్) తమ తమ పోటీలలో ఆధిపత్యం వహిస్తున్నారు. వారిద్దరు ఈ నెల ద్వితీయార్ధంలో తమ నామినేషన్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తర డకోటా నిబంధనల ప్రకారం, అభ్యర్థులు కనీసం 20శాతం వోటు సాధిస్తే డెలిగేట్లను గెలుచుకోవడానికి అర్హులు అవుతారు. అయితే, కనీసం 60 శాతం వోటు గెలుచుకున్న అభ్యర్థి రాష్ట్రంలోని మొత్తం 29 మంది డెలిగేట్లను పొందుతారు. బ్యాలట్‌పై ట్రంప్, హేలీతో సహా నలుగురు అభ్యర్థులు ఉన్నారు. తక్కిన ఇద్దరు అభ్యర్థులు అంతగా వోటర్ల దృష్టిని ఆకర్షించలేదు. వారిద్దరు ఫ్లోరిడా వాణిజ్యవేత్త డేవిడ్ స్టుక్కర్‌బెర్గ్, టెక్సాస్ వాణిజ్యవేత్త, పాస్టర్ ర్యాన్ బింక్లీ. బింక్లీ ఇటీవలే తన ప్రచారాన్ని ముగించారు.