Saturday, December 21, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జాతీయ బిసి యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఉత్తర ప్రదేశ్, బిహార్ లలో సంఘం రాష్ట్ర కమిటీలు వెయ్యడం జరిగిందని తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు బిసిలకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారని, అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉన్నందున గెలుపు గుర్రాలు, ఆర్థిక బలం అంటూ బిసి అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయని, బిజెపి కేంద్రంలో అధికారంలో ఉందని, ఈ మూడు పార్టీలు బిసిలకు టికెట్లు ఇస్తే గెలిపించుకుంటామని కృష్ణయ్య అన్నారు. రూ. 47 కోట్ల 65లక్షల 768 కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బిసిల సంక్షేమానికి బిక్షం ఇచ్చినట్లుగా కేవలం రూ. 2,150 కోట్లు కేటాయించి బిసిలకు అన్యాయం చేశారని విమర్శించారు. బిసిల విద్యా, ఉద్యోగ, ఆర్ధికాభివృధ్ధికి ఎలాంటి పథకాలు కాని కేటాయింపులు కాని లేవని విమర్శించారు. కేంద్రీయ విద్యా సంస్థలలో లక్షలాది బిసిలు చదువుకుంటున్నా వారికి ఫీజు రియింబర్స్‌మెంట్ లేదని, స్కాలర్ షిప్ ఇవ్వడం లేదని, హాస్టళ్ళు లేవని తెలిపారు. లక్షలాది రూపాయల ఫీజులు, మెయింటనెన్సు చార్జీలు కట్టలేక అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు చదువు మానేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్స్, ఫీజుల రియింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టాలని, జాతీయ బిసి కార్పొరేషన్ కు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. దేశంలో 56 శాతం జనాభా కలిగిన బిసిలకు అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిసి నాయకులు భరత్, నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News