Saturday, December 21, 2024

మస్క్‌పై ట్విట్టర్ మాజీ సిఇఒ దావా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ట్విట్టర్ సిఇఒ పరాగ్ అగర్వాల్‌తో సహా ఈ సంస్థకు చెందిన నలుగురు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు ఎలాన్ మస్క్‌పై దావా వేశారు. కంపెనీ తమకు 128 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,061 కోట్లు) బకాయిపడిందని పేర్కొన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ కేసు దాఖలైంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, దావా వేసిన వారిలో ట్విట్టర్ సిఇఒ పరాగ్, సిఎఫ్‌ఒ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దె, మాజీ జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ పేర్లు ఉన్నాయి. 2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సిఇఒతో సహా 4 మాజీ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News