కొన్ని గంటల పాటు స్తంభించిన సేవలు
ప్రపంచం మొత్తం మీద లక్షలాది మంది యూజర్లపై ప్రభావం
న్యూఢిల్లీ : మెటా యాజమాన్యం లోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొన్ని గంటల పాటు డౌన్ అయ్యాయి. వినియోగదారులు తమ ఖాతాల్లోకి వెళ్ల లేక పోయారు. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్టు తెలిపింది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన ఈరోజుల్లో ఇవి పనిచేయకపోతే అసలు ఏమీ తోచదు. నిన్న మెటా యాజమాన్యం లోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వాడుతున్న వినియోగదారులకు కొన్ని గంటల పాటు సేవలు స్తంభించాయి. యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవలు అమెరికా సహా పలు దేశాల్లో కొన్ని గంటల పాటు నిలిచిపోయా యి. పీక్‌దశలో 1,80,000 మంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ పనిచేయలేదని, జౌటేజ్ ట్రాకిం గ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్. కామ్ వెల్లడించింది. అనేక గంటలపాటు ప్రయత్నించిన తరువాత యాప్ సేవలను మెటా ఆధారిత ఇన్‌స్టాగ్రామ్ పునరుద్ధరించింది. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.45 గంటల కు ఇన్‌స్టాగ్రామ్ ఔటేజ్ మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ ను ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ యాప్ పనిచేయడం లేదని వినియోగదారులు ఫిర్యాదులు గుప్పించా రు. ఇన్‌స్టాగ్రామ్ బృందం తీవ్రంగా శ్రమించి గం టల వ్యవధిలో పునరుద్ధరించగలిగారు. అయితే ఈసారి భారత్‌పై దీని ప్రభావం కనిపించలేదు.