Monday, December 23, 2024

కాజల్ తో అభిమాని ఓవరాక్షన్!

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ తో సహా ప్రముఖ హీరోలందరి సరసన నటించి, పేరు సంపాదించుకుంది. పెళ్లి చేసుకున్నా, అడపాదడపా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ముఖ్యమైన పాత్రలు ధరిస్తూ, అభిమానులను అలరిస్తోంది. తాజాగా కాజల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె మంగళవారంనాడు  హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ కు గెస్ట్ గా వెళ్లింది.

షాపులన్నీ కలియదిరుగుతూ, అభిమానులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపింది. అడిగినవారికి ఆటోగ్రాఫ్ లు ఇస్తూ, కొందరు అబిమానులు సెల్ఫీలకోసం అడిగితే, కాదనకుండా వారితో పోటోలు దిగి, వారి ముచ్చట తీర్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఓవరాక్షన్ చేశాడు. సెల్ఫీ అడిగితే కాజల్ సరేనంది. అయితే ఆ అభిమాని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఫోటో తీసుకోబోయాడు. దీంతో కాజల్ గట్టిగా ‘ఏంటిది?’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News