- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు బిఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బిఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ పై బిఆర్ఎస్ నిరసన కార్యక్రమానికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతల ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు పసుపు నీళ్లతో జిహెచ్ఎంసి ఆఫీస్ లో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. బిఆర్ఎస్ ఆందోళనతో జిహెచ్ఎంసికి మురికి పట్టిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు మెక్కింది బిఆర్ఎస్ అని, బిఆర్ఎస్ చెయ్యలేని పని కాంగ్రెస్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.
- Advertisement -