Monday, January 20, 2025

నేడు జాన్వీ కపూర్ బర్త్ డే.. ఆకట్టుకుంటున్న దేవర పోస్టర్

- Advertisement -
- Advertisement -

నాటి అందాల సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ ఇటు అభినయంలోనూ, అటు అందాల ఆరబోతలోనూ తగ్గేదే లేదంటూ దూసుకుపోతోంది. ఇవాళ ఆ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవర మూవీ యూనిట్ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఓ చెట్టుకొమ్మను ఆనుకుని, అభిసారికలా నిలబడి నవ్వుల పువ్వులు పూయిస్తున్న జాన్వీకపూర్ పోస్టర్ నెట్ లో వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తున్న దేవర మూవీకి కొరటాల శివ దర్శకుడనే విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది. జాన్వీ కపూర్ కి ఇదే తొలి తెలుగు సినిమా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News