Monday, December 23, 2024

అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ

- Advertisement -
- Advertisement -

అమేథీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైన రాహుల్ గాంధీ అంతకుముందు 2002 నుంచి వరుసగా ఈ స్థానంలో గెలుపొందుతూ వచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి అమేథీ తిరిగి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యోఉడు ప్రదీప్ సింఘాల్ బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ అమేథీ నుంచి పార్టీ అభ్యర్థిగా రాహుల్ పోటీ చేస్తారని చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు.

2002 నుంచి 2019 వరకు అమోథీ లోక్‌సభ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో అమేథీలో ఓటమి పాలైన రాహుల్ కేరళలోని వయనాడ్‌లో గెలుపొందారు. కాగా..ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ మధ్య ఎన్నికల ఒప్పందం కుదరడంతో అమేథీ, రాయబరేలి స్థానాలను కాంగ్రెస్‌కు ఎస్‌పి కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News