Thursday, November 21, 2024

ఆర్‌ఎస్‌పి ఎఫెక్ట్.. బిఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప గుడ్ బై..?

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి కోనప్ప భేటీ
ఒకటి రెండు రోజుల్లో బిఆర్‌ఎస్‌కు
రాజీనామా చేసి కాంగ్రెస్ చేరే అవకాశం

హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప బిఆర్‌ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బిఆర్‌ఎస్ పార్టీ బిఎస్‌పితో పొత్తు పెట్టుకున్నందున ఆ పార్టీలో తాను కొనసాగలేనని కోనప్ప అంటున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కోనప్పపై బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయగా, తన ఓటమికి ప్రవీణ్ కుమార్ కూడా కారణమనే భావన కోనప్పలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అధినేత కెసిఆర్ తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా పొత్తు నిర్ణయం తీసుకున్నారని అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆ పార్టీ మార్పుపై దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. మంగళవారం నాడు తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించిన కోనేరు కోనప్ప.. ఒక్క రోజు వ్యవధిలోనే సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఒకటి రెండు రోజుల్లో కోనప్ప బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఈ నెల 12న గానీ.. 15న గానీ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. కోనేరు కోనప్ప బిఆర్‌ఎస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం బిఎస్‌పితో పొత్తు పెట్టుకోవడమే అని ఆయన అనుచరులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News