Tuesday, January 21, 2025

మల్కాజిగిరి ఎంఎల్ఎ కాలేజీలో అక్రమ నిర్మణాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: దుండిగల్ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన కాలేజీలోని అక్రమ నిర్మాణాలను అధికారులు జెసిబి సహాయంతో కూల్చివేశారు. మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని గతంలో ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News