- Advertisement -
వికారాబాద్: 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్కూల్ కు వెళ్లాలని కూతురు శ్రీవాణిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై బాలిక ఇంట్లో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్ధానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు వికారాబాద్ జిల్లా మద్గుల్ ప్రాంతం చిట్టెంపల్లి గ్రామానికి చెందిన బాలికగా గుర్తించారు.
- Advertisement -