Saturday, January 18, 2025

జైశ్వాల్ ఔట్.. రోహిత్ హాఫ్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ధర్మశాల స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ ఓపెనర్లు అర్థ శతకాలు బాదారు. ధనాధన్ బ్యాటింగ్ తో వేగంగా పరుగులు రాబడుతూ అలరించారు. ఈ క్రమంలో ముందుగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచరీ సాధించాడు. అదే జోరులో బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ పూర్తి చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది.

క్రీజులో రోహిత్ శర్మ(52), శుభ్ మన్ గిల్(26)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ కంటే 83 పరుగులు వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News