Thursday, January 23, 2025

మహా శివరాత్రి శోభ… ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలయాల్లో భక్తులు కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న కొండ భక్తజనంతో నిండిపోయింది. శివనామస్మరణతో ఇలకైలాసగిరులు మార్మోగుతున్నాయి. ్రశ్రీశైలంలో ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో భక్తుల తాకిడి పెరిగింది.

Shivaratri celebration in komuravelli mallanna temple

Maha shivaratri festival in Telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News