Sunday, November 24, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 88 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 394 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే భారత్ 176 పరుగుల ఆధిక్యంలో ఉంది. సర్ఫరాజ్ ఖాన్ 56 పరుగులు చేసి షోయ్‌బ్ బషీర్ బౌలింగ్‌లో జోయ్ రూట్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. దేవ్ దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. భారత బ్యాట్స్‌మెన్లలో శుభ్‌మన్ గిల్(110), రోహిత్ శర్మ(103), యశస్వి జైస్వాల్(57) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో దేవ్‌దూత్ పడిక్కల్(60), రవీంద్ర జడేజా(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ రెండు వికెట్లు తీయగా జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News