Monday, December 23, 2024

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును (నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని ప్రయాణికులకు పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు. అయితే ఈ రైలుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక రైలును (నం. 08134) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వందేభారత్ షెడ్యూల్ ప్రకారమే ఆ రైలు బయలుదేరుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ రైలు మాదిరిగా అన్ని స్టాప్‌లతోనే నడుపుతామని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, ఆసక్తిగల ప్రయాణికులు దయచేసి ఈ రైలులో టిక్కెట్‌లను బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News