- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తాను పార్టీ మారడం లేదని మాజీమంత్రి మల్లా రెడ్డి స్పష్టం చేశారు. మాజీమంత్రి మల్లా రెడ్డి తన కుమారుడు భద్రా రెడ్డితో శుక్రవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిసి తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కెటిఆర్‌కు భద్రా రెడ్డి చెప్పినట్లు తెలిసింది. సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి పూర్తి వివరణ ఇచ్చారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనాల కూల్చివేత గురించి కలిసినట్లు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు మల్లా రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -