Saturday, December 21, 2024

బాండ్స్ వ్యాజ్యంపై 11న విచారణ

- Advertisement -
- Advertisement -

ఎలక్టోరల్ బాండ్స్ వివాద వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 11వ తేదీన జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీలకు దక్కిన నగదు ఎంత అనేది లెక్కలు తెలియచేయడానికి తమకు జూన్ 30వ తేదీ వరకూ అవకాశంఇవ్వాలని ఎస్‌బిఐ కోరింది . ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తుంది. బాండ్స్ విషయంలో ఎస్‌బిఐ చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని, ఈ విధంగా కోర్టు ధిక్కారానికి పాల్పడిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ కూడా విచారణకు వస్తుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వేర్వేరు పిటిషన్లను విచారిస్తుంది. గత నెల 15న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ఎలక్టోరల్ బాండ్స్ అక్రమమని కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News