Tuesday, April 1, 2025

హవాలా డబ్బులు పట్టివేత

- Advertisement -
- Advertisement -

లెక్కలో చూపని హవాలా డబ్బులను మేడ్చల్ ఎస్‌ఓటి పోసులు శుక్రవారం పట్టుకున్నారు. డబ్బులు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.19.2లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కొందరు వ్యక్తులు హవాలా డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం మేడ్చల్ ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌ఓటి పోలీసులు బాలానగర్‌లోని రంగారెడ్డి నగర్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు రూ.19,02,000 లభించాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా కోరగా ముగ్గురు వ్యక్తులు విఫలమయ్యారు. దీంతో డబ్బులను సీజ్ చేసిన పోలీసులు బాలానగర్ పిఎస్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News