Monday, December 23, 2024

కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య రసాభాస జరిగింది. జగిత్యాల తహసీల్దార్ కార్యలయంలో శనివారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పాల్గొన్నారు. చెక్కుల పంపిణీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో కాసేపు కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరువర్గాల సముదాయించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News