- Advertisement -
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
ఎస్ఆర్ డిపిలో భాగంగా రూ.148.5 కోట్లతో సెకండ్ లేవల్ వంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ నుంచి హయత్ నగర్ వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతోంది.
- Advertisement -