Monday, December 23, 2024

బిఆర్ఎస్ తో పొత్తుకు మాయావతి ఓకే

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తుకు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి రెండు రోజుల క్రితంచేసిన ప్రకటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. అప్పటికే బిఆర్ఎస్, బిఎస్ పీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మాయవతి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. అయితే ఇందుకు మాయావతి ఒప్పుకున్నారని, బిఆర్ఎస్ తో జరిగే తమ తదుపరి సమావేశానికి బిఎస్పీ ఎంపీ రాంజీ బెహన్ జీ దూతగా వస్తారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News