Friday, December 20, 2024

స్కార్పియో ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో ఆదివారం ఒక ఎస్‌యువి కింద పడి గర్భిణితో సహా ఒక కుటుంబ సభ్యులు నలుగురు దుర్మరణం చెందారని పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్ దేగానాలో ఆదివారం తెల్లవారు జామున ఒక స్కార్పియో ఢీకొని ఛోటు రామ్, అతని భార్య సుమన్, వారి రెండు సంవత్సరాల కుమారుడు హృతిక్, మరొక మహిళ మరణించారు. సుమన్ ఎనిమిది నెలల గర్భిణి అని అధికారులు తెలిపారు. ఆ నలుగురూ కూలీలే అని, ఒక వివాహం కోసం వెళుతున్నారని పోలీసులు చెప్పారు.

ఒక పని కోసం ఈవెంట్ నిర్వాహకులు వారిని నియోగించుకున్నారని, ‘దేగానా వెళ్లేందుకు బస్సు కోసం వారు వేచి ఉండగా ఎస్‌యువి వారిని ఢీకొన్నది’ అని అధికారులు వివరించారు. ప్రమాదం తరువాత స్కార్పియో డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. పరారైన ఎస్‌యువి డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News