- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో బీహార్ కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గౌర బడా షాహ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్జాగ్‌కేరాకట్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు జిల్లా ఎస్‌పి అజయ్ పాల్ శర్మ చెప్పారు. మృతులంతా కారులో ప్రయాగ్‌రాజ్ వెళ్తు న్నారు. గాయపడిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులు వారణాసిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌పి తెలిపారు. మృతుంతా బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్లు ఆయన చెప్పారు.
- Advertisement -